వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు | ysrcp leaders met ys jagan mohan reddy in hospital | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు

Oct 13 2015 3:09 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ నేతలు కలిశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

గుంటూరు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ నేతలు కలిశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్ జగన్ను కలిసినవారిలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించి పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు.

 అంతకు ముందు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement