'ఆర్టీసీని ప్రైవేటు ట్రావెల్స్కు అప్పగించేందుకు కుట్ర' | ysr majdoor union leaders meeting with rtc employees | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీని ప్రైవేటు ట్రావెల్స్కు అప్పగించేందుకు కుట్ర'

Jan 28 2016 1:37 PM | Updated on May 29 2018 4:26 PM

ఆర్టీసీ కార్మికులతో గురువారం వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ సమావేశమైంది.

పశ్చిమగోదావరి: ఆర్టీసీ కార్మికులతో గురువారం వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ సమావేశమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, రవీంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మెందుకు ప్రయత్నిస్తోందని, ఆర్టీసీని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలకు అప్పగించేలా కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అందరినీ మోసం చేశారని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని అంబటి రాంబాబు, రవింద్రనాథ్ రెడ్డి ఆర్టీసీ కార్మికులతో స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement