అనంతపురం జిల్లాలో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ఇది నాలుగో విడత రైతు భరోసా యాత్ర.
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ఇది నాలుగో విడత రైతు భరోసా యాత్ర.
ఇందులో భాగంగా వైఎస్ జగన్ ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు.