వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ ప్రతిపాడు బయల్దేరారు. అక్కడ నుంచి పెదగొట్టిపాడు వెళతారు.
ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.