వచ్చే నెల 3వ తేదీన వైఎస్ జగన్ అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
అనంతపురం : రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పోరుబాటలో భాగంగా అనంతపురంలో ధర్నా నిర్వహిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో శంకర్నారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న జరగాల్సిన ధర్నా వాయిదా పడిందని తెలిపారు. వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొంటారని శంకర్ నారాయణ పేర్కొన్నారు.