ప్రేమ విఫలమైందని కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన వీరగోని సాయిప్రసన్న(22) సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ విఫలమైందని ఆత్మహత్య
Sep 13 2016 10:49 PM | Updated on Aug 1 2018 2:35 PM
సెంటినరీకాలనీ : ప్రేమ విఫలమైందని కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన వీరగోని సాయిప్రసన్న(22) సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూటౌన్ సీఐ దేవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయిప్రసన్న గ్రామానికి చెందిన ఓ మైనర్‌ను ప్రేమిస్తున్నాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోయారు. తర్వాత సాయిప్రసన్న చీరతో ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి సోదరుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement