బాలికపై వేధింపులు.. యువకుడి అరెస్ట్ | young man arrested over harassments on girl | Sakshi
Sakshi News home page

బాలికపై వేధింపులు.. యువకుడి అరెస్ట్

Jul 22 2016 3:40 PM | Updated on Sep 26 2018 6:15 PM

ఇంటి పక్కనే ఉంటున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు.

హైదరాబాద్: ఇంటి పక్కనే ఉంటున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన పరిధిలోని ఆర్టీసీ కాలనీలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక కాలనీకి చెందిన సాయికుమార్(21) అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీని పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహించి సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement