జీవో 43ను ఉపసంహరించాలంటూ ధర్నా | withdraw GO 43 | Sakshi
Sakshi News home page

జీవో 43ను ఉపసంహరించాలంటూ ధర్నా

Aug 5 2016 1:20 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఏలూరు (సెంట్రల్‌) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్‌ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

ఏలూరు (సెంట్రల్‌) : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జీవో నంబర్‌ 43ను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ అర్బన్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్‌ వారికి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తుందని దాని కోసం తెచ్చి జీవో 43ను ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్‌ నాయకులు బి.బెనర్జీ, ఎన్‌.అంజలి, ఎండీ రిజియాన్, ఆర్‌.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.రత్నం పాల్గొన్నారు.
జూట్‌ కార్మికుల ధర్నా
జూట్‌ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా వేజ్‌ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జూట్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర కార్యదర్శి పి.కిషోర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది జూట్‌ కార్మికులు పనిచేస్తారని, వారికి కనీసవేతనం అమలు కావడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా జూట్‌ కార్మికులకు వేజ్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీసవేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో బి.జగన్నాధం, వి.సాయిబాబు, డి.దుర్యోదన. పి.మాణిక్యలరావు, పి.సత్తిరాజు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement