ఆనందాలకు అడ్డొస్తున్నాడని... | wife killed her husband in nizamabad district | Sakshi
Sakshi News home page

ఆనందాలకు అడ్డొస్తున్నాడని...

Jul 28 2015 1:42 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఆనందాలకు అడ్డొస్తున్నాడని... - Sakshi

ఆనందాలకు అడ్డొస్తున్నాడని...

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న వాడినే హత్య చేసింది.

వర్ని: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న వాడినే హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగిత్తగుట్ట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివలాల్ (28), అతడి భార్య జ్యోతికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. జ్యోతి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్న శివలాల్ ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో శివలాల్ అడ్డు తొలగించుకోవాలని జ్యోతి పథకం వేసింది. జ్యోతి సోమవారం కొడుకుని తన పుట్టింటికి పంపింది. రాత్రి మద్యం మత్తులో శివలాల్ ఇంటికి వచ్చి నిద్రిస్తుండగా, కాళ్లు చేతులు కట్టేసి అతడి గొంతు నులిమి హత్య చేసింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement