ఆంధ్రాబ్యాంక్ గ్రామీణా స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ డైరెక్టర్ ఎన్.సుబ్బదాసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్ సమీపంలోని ఆల్కాట్‌తోటలో ఉన్న తమసంస్థలో వివిధ కోర్సుల్లో ఇచ్చే శిక్షణ టెన్త్‌పాసై 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
Sep 30 2016 11:38 PM | Updated on Sep 4 2017 3:39 PM
తాడితోట (రాజమహేంద్రవరం) :
ఆంధ్రాబ్యాంక్ గ్రామీణా స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ డైరెక్టర్ ఎన్.సుబ్బదాసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్ సమీపంలోని ఆల్కాట్‌తోటలో ఉన్న తమసంస్థలో వివిధ కోర్సుల్లో ఇచ్చే శిక్షణ టెన్త్‌పాసై 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ఆల్కాట్‌తోటలో ఇంటర్వూ్యలు జరుగుతాయన్నారు. వివరాలకు 0883–2420242, 2428807, 94404 14910ను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement