వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం మోతుకువాండ్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు.
	 వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం మోతుకువాండ్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మోతుకువాండ్లపల్లికి చెందిన నర్సింహారెడ్డి, డ్రైవర్ గుత్తి వెంకటరమణ కలసి ట్రాక్టర్‌లో కలకడ నుంచి మోతుకువాండ్లపల్లి వైపు వెళ్తున్నారు. సమీపంలోని హంద్రీనీవా కాల్వ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో నర్సింహారెడ్డి(55), వెంకటరమణ(25) అక్కడికక్కడే చనిపోయారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
