వీటి ధరలు దారుణంగా పడిపోయాయి: అవినాష్ రెడ్డి | Avinash Reddy Highlights Farmers’ Distress | Sakshi
Sakshi News home page

వీటి ధరలు దారుణంగా పడిపోయాయి: అవినాష్ రెడ్డి

Mar 31 2026 11:10 AM | Updated on Mar 31 2026 1:02 PM

Avinash Reddy Highlights Farmers’ Distress

సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ (మార్చి 31) వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో పర్యటించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే రేటు రూ.1400కి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోనూ వెంటనే ఏర్పాటు చేయాలి. అరటి ధర కూడా దారుణంగా పడిపోయింది. టన్నుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కూడా రావడం లేదు. ఇరాన్ యుద్ధం, ముంబై మార్కెట్లో అరటి అధికంగా రావడంతో ధర దారుణంగా పడిపోయింది. 

అరటి పంటను కనీసం టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేల ధర వచ్చేలా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతోంది. రేపు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు సమస్యను తీసుకువెళ్లాలి, మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి’ అని అన్నారు. 

కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి

Advertisement
 
Advertisement
Advertisement