చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి | two died in road accident, car hits tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

Dec 29 2015 6:49 AM | Updated on Sep 3 2017 2:46 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

మృతులు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందినవారుగా పోలీసులు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement