దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటికే జిల్లాల వారీగా మండలాల విషయంలో కసరత్తు పూర్తి చేసింది. అలాగే, ప్రభుత్వ ఆదేశాలకు అధికారులు కార్యాలయాల ఎంపిక, సౌకర్యాల కల్పనలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆఖరి అంకానికి చేరుకుంది.
-
జిల్లాల పునర్విభజనపై సమీక్ష
హన్మకొండ : దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటికే జిల్లాల వారీగా మండలాల విషయంలో కసరత్తు పూర్తి చేసింది. అలాగే, ప్రభుత్వ ఆదేశాలకు అధికారులు కార్యాలయాల ఎంపిక, సౌకర్యాల కల్పనలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆఖరి అంకానికి చేరుకుంది. దసరా సమీపిస్తున్న క్రమంలో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఇదేరోజు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల నేతల సమావేశం జరగనుండగా.. మధాహ్నం 12 గంటలకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ బేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై జిల్లాలు, డివిజ¯ŒSలు, మండలాల ఏర్పాటు, చేర్పులు, మార్పులపై సీఎం చర్చిస్తారు. కాగా, వరంగల్, హన్మకొండ జిల్లాలపై కొంత మేర సందిగ్దత ఉన్న నేపథ్యంలో సోమవారం నాటి సమావేశం కీలకం కానుంది. జిల్లాల స్వరూపంపై పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సలహాలు, సూచనలు స్వీకరించి తుది రూపు ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.