ట్రాన్స్‌కో అధికారుల నిలదీత | Transco | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో అధికారుల నిలదీత

Sep 11 2016 10:21 PM | Updated on Sep 4 2017 1:06 PM

ట్రాన్స్‌కో అధికారుల నిలదీత

ట్రాన్స్‌కో అధికారుల నిలదీత

విద్యుత్‌ బిల్లుల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదివారం నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామస్తులు

నిజాంసాగర్‌ : విద్యుత్‌ బిల్లుల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదివారం నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామస్తులు నిలదీశారు. విద్యుత్‌ బిల్లులు ఎప్పటికంటే ఎక్కువ వచ్చాయంటూ గ్రామస్తులు బిల్‌ కలెక్టర్‌తో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వచ్చాయని, ఎక్కువగా వచ్చినట్లుంటే ట్రాన్స్‌కో కార్యాలయంలో సంప్రదించాలని వారు గ్రామస్తులకు సూచించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని గ్రామస్తులకు ట్రాన్స్‌కో అధికారులు సూచించడంతో వారు శాంతించారు. 

Advertisement
 
Advertisement
Advertisement