మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే | To provide assistance to the families of the dead | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

Jul 17 2016 7:09 PM | Updated on Sep 4 2017 5:07 AM

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

మాదారం (బీబీనగర్‌) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్‌ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

మాదారం (బీబీనగర్‌) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్‌ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాదారం గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు సంభవించకుండా ట్రాన్స్‌కో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గొల్లగూడెం, నీలంబావిలో జరుగుతున్న సీసీరోడ్ల పనులను పరిశీ లించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, ప్రధాన కార్యదర్శి పంజాల సత్తీష్‌గౌడ్, సర్పంచ్‌లు ఒగ్గు పాండు, శ్రీరాం పద్మజంగయ్య, జిట్ట అలివేలమల్లారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement