ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి | To partner in helathy telangana | Sakshi
Sakshi News home page

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

Aug 14 2016 11:30 PM | Updated on Sep 4 2017 9:17 AM

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

దురాజ్‌పల్లి(చివ్వెంల) : ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు భాగస్వాములు కావాలని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు సత్యనారాయణ కోరారు.

దురాజ్‌పల్లి(చివ్వెంల) :  ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు భాగస్వాములు కావాలని ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు సత్యనారాయణ కోరారు. ఆదివారం మండల పరిధిలోని దురాజ్‌పల్లిలో నిర్వహించిన ఆసంఘం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 వేల మంది ఆర్‌ఎంపీలు (రూరల్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌) లకు శాస్త్రీయంగా పారామెడికల్‌ శిక్షణను ప్రభుత్వ ఆస్పత్రిలో పునర్‌ ప్రారంభించారు. శిక్షణ పూర్తిచేసిన గ్రామీణ వైద్యులకు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. సభ్యులంతా ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఉండాలని, సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈసందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా మల్లేబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వి.సత్యం, పూర్ణచందర్‌రావు నాగరాజులను ఎనుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాశంకర్‌ వ్యవహరించిన ఈకార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు వెంకన్న గౌడ్, తిరుపతి, శోభన్‌బాబు, నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement