ఫ్యాప్టో పోరాట ఫలితంగా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించ తలపెట్టిన ఉపాధ్యాయ సామర్థ్య పరీక్ష (టీఎన్‌ఐటీ)ను వాయిదా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి సామల సింహాచలం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎన్‌ఐటీ వాయిదాకు మంత్రి హామీ
Aug 17 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:41 AM
శ్రీకాకుళం: ఫ్యాప్టో పోరాట ఫలితంగా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించ తలపెట్టిన ఉపాధ్యాయ సామర్థ్య పరీక్ష (టీఎన్‌ఐటీ)ను వాయిదా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి సామల సింహాచలం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల సామర్థాలను పరీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీఎన్‌ఐటీ పరీక్షను బాయ్‌కాట్ చేయాలని ఇచ్చిన పిలుపునకు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు టీఎన్‌ఐటీ పరీక్షకు నమోదు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావును బుధవారం ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం విజయవాడలో కలిసి టీఎన్‌ఐటీ పరీక్షను రద్దు చేయాలని కోరగా మంత్రి స్పందించి వాయిదా వేస్తామని, ఈ సమస్యపై అన్ని ఉపాధ్యాయ సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారనిచెప్పారు.
Advertisement
Advertisement