కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మరియాపురంలో మరాఠీ వీధికి చెందిన ఆర్‌సీ ఓబుళ రెడ్డి, అతని భార్య లక్ష్మిదేవి, కుమారుడు రఘురామి రెడ్డిలను ఫోర్జరీ కేసులో ఎస్‌ఐ ఎన్. రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో గురవారం అరెరస్టు చేశారు.
కడప అర్బన్ : కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మరియాపురంలో మరాఠీ వీధికి చెందిన ఆర్‌సీ ఓబుళ రెడ్డి, అతని భార్య లక్ష్మిదేవి, కుమారుడు రఘురామి రెడ్డిలను ఫోర్జరీ కేసులో ఎస్‌ఐ ఎన్. రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో గురవారం అరెరస్టు చేశారు. నిందితుడు ఆర్‌సీ ఓబుళ రెడ్డి తండ్రి ఓబుళరెడ్డికి సంబంధించిన 6 సెంట్ల స్థలాన్ని , సోదరుడు, ఫిర్యాది అక్కాయపల్లెకు చెందిన లక్ష్మినారాయణ రెడ్డికి తెలియకుండా ఫోర్జరీ చేసి స్థలాన్ని విక్రయించాడనీ, ఇందులో అతని భార్య ,కుమారుడి ప్రమేయం ఉందని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ కోర్టును ఆశ్రయించారు. జూన్ 16న ఈ వ్యవహారంపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. గురువారం నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.