జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి | The steel plant to be set up In YSR District | Sakshi
Sakshi News home page

జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

Jan 16 2017 9:12 PM | Updated on Sep 5 2017 1:21 AM

జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

స్టీల్‌ ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 18న చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో ఎమ్మార్పీఎస్‌ (మందకృష్ణమాదిగ) నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు.

ప్రొద్దుటూరు టౌన్‌ : స్టీల్‌ ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 18న చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో ఎమ్మార్పీఎస్‌ (మందకృష్ణమాదిగ) నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి దీక్షాశిబిరంలో కూర్చున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మురళీకృష్ణమనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా వాసి అయినందున సీఎం వివక్షత చూపుతున్నారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే రాయలసీమ జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. రిలే దీక్షలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు మబ్బు గుర్రప్ప, సుబ్బు, కత్తి గుర్రయ్య, ఇల్లూరు గురుశంకర్, గజ్జల బాలన్న, గౌడ సంఘం నాయకులు శ్రీను గౌడ్, రామయ్య గౌడ్, పీడీఎస్‌యూ నాయకులు రమేష్, బాల, మాలమహానాడు నాయకులు ఐజయ్య, పీరా తదితరులు ఉన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ సాధనా సమితి నాయకులు అమరనాథరెడ్డి, ఖలందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement