కొల్లేరు అభయారణ్యం పరిధిలో.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామ పరిసరాల్లో చెరువు గట్లు ఏర్పాటు చేసుకుని స్థానికులు చేపల పెంపకానికి ఉద్యుక్తులు కావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కొల్లేరు పరిధిలో మరోసారి ఉద్రిక్తత
Dec 23 2015 11:27 AM | Updated on Sep 3 2017 2:27 PM
ఏలూరు: కొల్లేరు అభయారణ్యం పరిధిలో.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామ పరిసరాల్లో చెరువు గట్లు ఏర్పాటు చేసుకుని స్థానికులు చేపల పెంపకానికి ఉద్యుక్తులు కావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం వారి చర్యలను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు అధికారుల వాహనాన్ని చుట్టుముట్టి ఘోరావ్ చేశారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం గతంలో చెరువు గట్లను తొలగించిన విషయం తెలిసిందే.
Advertisement


