'మోదీ ప్రణాళికలతో పేదవారికి ఒరిగిందేమీ లేదు' | suravaram fires on narendra modi | Sakshi
Sakshi News home page

'మోదీ ప్రణాళికలతో పేదవారికి ఒరిగిందేమీ లేదు'

Jan 22 2016 7:41 PM | Updated on Jul 26 2019 5:38 PM

సీపీఎం జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు.

విశాఖపట్నం: సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ప్లాంట్లో జాతీయ మహిళా సమాఖ్య మహసభలో పాల్గొన్న సురవరం మాట్లాడుతూ.. ప్రధాని వాగుడే తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు.

మోదీ ప్రణాళికలు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉన్నాయే కానీ పేదవారికి ఉపయోగపడేలా లేవని సురవరం విమర్శించారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగినా అధికార బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. ఏబీవీపీ ఆగడాల వల్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement