విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి | Students strength to be increased in government schools | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

Nov 24 2016 11:40 PM | Updated on Oct 20 2018 6:19 PM

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి - Sakshi

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

గూడూరు: ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని డీఈఓ మువ్వా రామలింగం అన్నారు. స్థానిక గ్రీన్‌వ్యాలీ పబ్లిక్‌ స్కూల్లో గురువారం డివిజన్‌ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు.

గూడూరు:
ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని డీఈఓ మువ్వా రామలింగం అన్నారు. స్థానిక గ్రీన్‌వ్యాలీ పబ్లిక్‌ స్కూల్లో గురువారం డివిజన్‌ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీంతో అందరూ కలిసి సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రణాళిక సిద్ధ చేసి ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు కొన్ని పాఠశాలల్లోని వారు ఆన్‌లైన్‌లో ఉంచడం లేదన్నారు. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో ఉంచని పాఠశాలలు తప్పక ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఏ పాఠశాలకైనా వంట గదులు, అంసపూర్తిగా భవనాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పలు విషయాలపై ఆయన ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మంజులాక్షి. ఎంఈఓ మధుసూదనరావు, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement