3, 4న రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నీ | state chess tourny to be conduct on 3rd, 4th | Sakshi
Sakshi News home page

3, 4న రాష్ట్రస్థాయి చెస్‌ టోర్నీ

Aug 24 2016 12:49 AM | Updated on Sep 4 2017 10:33 AM

జిల్లా కేంద్రంలో వచ్చేనెల 3, 4న రంగస్వామి మెమోరియల్‌ అండర్‌–17 రాష్ట్రస్థాయి బాల, బాలికల చెస్‌ టోర్నీ నిర్వహించనున్నట్టు చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ప్యాట్రన్‌ నటరాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహబూబ్‌నగర్‌ క్రీడలు : జిల్లా కేంద్రంలో వచ్చేనెల 3, 4న రంగస్వామి మెమోరియల్‌ అండర్‌–17 రాష్ట్రస్థాయి బాల, బాలికల చెస్‌ టోర్నీ నిర్వహించనున్నట్టు చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ప్యాట్రన్‌ నటరాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాస్థాయి టోర్నీల్లో గెలుపొందిన వారితోపాటు స్పెషల్‌ ఎంట్రీ కింద క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 1999 జనవరి 1 తర్వాత పుట్టినవారు టోర్నీకి అర్హులని, ఈనెల 31లోపు ఎంట్రీలు పంపుకోవాలన్నారు. ఆసక్తిగల వారు ప్రవీణ్‌కుమార్‌ (సెల్‌నం.8523020860), రవి (8374792383) లను సంప్రదించాలని వారు కోరారు.
 
 

Advertisement

పోల్

Advertisement