breaking news
special entries
-
ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్‌గా స్వాగతం పలికిన అత్తామామ!
పెళ్లి వేడుక అనగానే కుటుంబ సభ్యులు, బంధువులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక, వివాహ వేడుకలో వరుడు ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో సోషల్ మీడియాలో చాలా వీడియోలే చూసి ఉంటారు. కానీ.. వీరి పెళ్లిలో వరుడికి దక్కిన అరుదైన ఎంట్రీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా, ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది. పెళ్లి వేడుకకు పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతిస్తారు. ఇక, ఈ వీడియోను పెళ్లికి హాజరైన జుహీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తమ ప్రాంతంలోని ఆచారం కోసమే వరుడు, వధువు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వరుడు సిగరెట్ తాగలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ ఆచారం దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాలు, బీహార్, ఒడిషాలోనూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఆచారంరా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. View this post on Instagram A post shared by Joohi K Patel (@joohiie) -
3, 4న రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లా కేంద్రంలో వచ్చేనెల 3, 4న రంగస్వామి మెమోరియల్ అండర్–17 రాష్ట్రస్థాయి బాల, బాలికల చెస్ టోర్నీ నిర్వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ప్యాట్రన్ నటరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాస్థాయి టోర్నీల్లో గెలుపొందిన వారితోపాటు స్పెషల్ ఎంట్రీ కింద క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 1999 జనవరి 1 తర్వాత పుట్టినవారు టోర్నీకి అర్హులని, ఈనెల 31లోపు ఎంట్రీలు పంపుకోవాలన్నారు. ఆసక్తిగల వారు ప్రవీణ్‌కుమార్ (సెల్నం.8523020860), రవి (8374792383) లను సంప్రదించాలని వారు కోరారు.