6న సిద్దిపేట పుర ఎన్నికలు | siddipet municipality elections be held on april 6th | Sakshi
Sakshi News home page

6న సిద్దిపేట పుర ఎన్నికలు

Mar 21 2016 2:43 AM | Updated on Aug 14 2018 5:56 PM

సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.

- షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది.

బుధవారం (23వ తేదీ) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 9న నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆరు శివారు గ్రామాలు విలీనమయ్యాక సిద్దిపేట పట్టణంలోని వార్డుల సంఖ్య 32 నుంచి 34కు పెరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 88,982 ఓటర్లు ఉండగా ఇందులో 44,562 మంది పురుషులు, 44,412 మంది మహిళలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement