breaking news
April 6th
-
6న సిద్దిపేట పుర ఎన్నికలు
- షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. బుధవారం (23వ తేదీ) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 9న నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆరు శివారు గ్రామాలు విలీనమయ్యాక సిద్దిపేట పట్టణంలోని వార్డుల సంఖ్య 32 నుంచి 34కు పెరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 88,982 ఓటర్లు ఉండగా ఇందులో 44,562 మంది పురుషులు, 44,412 మంది మహిళలు ఉన్నారు. -
ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
-
ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభలతో పాటు పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగగా.. వీటితో పాటు పంచాయతీ రాజ్ సమరానికి తెరలేవనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలను ఈవీఎంల ద్వారా గాక బ్యాలెట్ పత్రం ద్వారా నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.