ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది.
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభలతో పాటు పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగగా.. వీటితో పాటు పంచాయతీ రాజ్ సమరానికి తెరలేవనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది.
ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలను ఈవీఎంల ద్వారా గాక బ్యాలెట్ పత్రం ద్వారా నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.


