ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ | several ias officers transfers in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ

Jul 22 2016 5:52 PM | Updated on Aug 18 2018 8:05 PM

ఆంధ్రప్రదేశ్లో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, నెల్లూరు కలెక్టర్గా ముత్యాలరాజు, విశాఖ మున్సిపల్ కమిషనర్గా హరినారాయణణ్, చిత్తూరు జాయింట్ కలెక్టర్గా గిరీశ్ షా, పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీడీగా శివశంకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ప్రస్తుతం విశాఖ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువరాజు, అలాగే నెల్లూరు కలెక్టర్ జానకి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement