రేడియోధార్మికతతో ప్రయోజనాలు | seminar on radio chemistry | Sakshi
Sakshi News home page

రేడియోధార్మికతతో ప్రయోజనాలు

Sep 27 2016 9:08 PM | Updated on Sep 4 2017 3:14 PM

రేడియోధార్మికతతో ప్రయోజనాలు

రేడియోధార్మికతతో ప్రయోజనాలు

రేడియో ధార్మికత వల్ల వైద్య రంగంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ ఆటమిక్‌ రీసర్చ్‌ శాస్త్రవేత్త సి.ఆర్‌.వెంకటసుబ్రహ్మణి అన్నారు. మంగళవారం ఉదయం పి.బి.సిద్ధార్థ కళాశాలలోసి సెమినార్‌ హాలులో కశాళాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో కెమిస్రీ’్ట అంశంపై సదస్సు జరిగింది.

శాస్త్రవేత్త వెంకటసుబ్రహ్మణి
మొగల్రాజపురం :
 రేడియో ధార్మికత వల్ల వైద్య రంగంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ ఆటమిక్‌ రీసర్చ్‌ శాస్త్రవేత్త సి.ఆర్‌.వెంకటసుబ్రహ్మణి అన్నారు. మంగళవారం ఉదయం పి.బి.సిద్ధార్థ కళాశాలలోసి సెమినార్‌ హాలులో కశాళాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో కెమిస్రీ’్ట అంశంపై సదస్సు జరిగింది. వెంకటసుబ్రహ్మణి మాట్లాడుతూ మనిషి ఎముకల సాంధ్రతను పరిశీలించడంతో పాటు పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించే ఎముకలు, వస్తువులు ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందినవో తెలిపేందుకు రేడియోధార్మికత ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయరంగంలో కూడా దీనివల్ల ఉపయోగాలున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ రంగంపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా పరిశోధనల జరిపి దేశానికి ఉపయోగపడవచ్చునని సూచించారు. కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను తీసుకువచ్చి వారితోనే ఆయా అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కళాశాల డీన్‌ రాజేష్, ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్, కళాశాల రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎం.మనోరంజని పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement