‘మల్లన్నసాగర్‌’పై అనవసర రాద్ధాంతం | Selfish on mallannasagar | Sakshi
Sakshi News home page

‘మల్లన్నసాగర్‌’పై అనవసర రాద్ధాంతం

Jul 28 2016 12:50 AM | Updated on Sep 4 2017 6:35 AM

‘మల్లన్నసాగర్‌’పై అనవసర రాద్ధాంతం

‘మల్లన్నసాగర్‌’పై అనవసర రాద్ధాంతం

మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కడితే తమ ఉనికి కోల్పోతామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

వలిగొండ : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కడితే తమ ఉనికి కోల్పోతామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెల్వర్తిలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.  సర్పంచ్‌ మల్లం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ అని  అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న ఉద్దేశంతోనే మిషన్‌ భగీరథకు మూడేళ్ల సమయం పెట్టారన్నారు. తెలంగాణ సాధించుకున్నందునే మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నిధులు మనమే ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. జిల్లాలో 24 నెలల్లో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్‌కు రైతుల మద్దతు ఉంది కాబట్టే భువనగిరిలో నిర్వహించిన ర్యాలీకి రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని అన్నారు. డీఎంహెచ్‌ఓ భానుప్రసాద్‌ మాట్లాడుతూ వలిగొండ వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి స్టాఫ్‌ను వెల్వర్తికి పంపుతున్నామని, వలిగొండలో ఓపీ అందుబాటులో ఉంచుతామన్నారు. నూతన భవనం నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు పలు సమస్యలపై మంత్రికి వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, వంగాల వెంకన్న, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, వెల్వర్తి ఎంపీటీసీ గుండు శేఖర్, తహసీల్దార్‌ అరుణారెడ్డి, ఎంపీడీఓ సరస్వతి, ప్రత్యేక అధికారి సుకీర్తి,  పీఆర్‌ డీఈ రాజేందర్‌రెడ్డి, ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఏఓ శోభారాణి, డాక్టర్‌ సుమన్‌కల్యాణ్, సంతోష్‌రెడ్డి, ఏపీఓ ఇమ్మానియేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement