కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. గతంలో దూర విద్య పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటిం చిన అధికారులు.. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు ఉన్నాయని చెబుతూ వాయి దా వేశారు. అప్పటి నుంచి మళ్లీ షెడ్యూల్ వెల్లడించకపోవడంతో అభ్యర్థు లు ఆందోళన చెందుతున్నారు.
కేయూ క్యాంపస్ : కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. గతంలో దూర విద్య పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటిం చిన అధికారులు.. ఆ తర్వాత కృష్ణా పు ష్కరాలు ఉన్నాయని చెబుతూ వాయి దా వేశారు. అప్పటి నుంచి మళ్లీ షె డ్యూల్ వెల్లడించకపోవడంతో అభ్యర్థు లు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై ‘పుష్కరాలు ముగిశాయ్.. పరీక్షలెన్నడు?’ శీర్షికన ‘సాక్షి’లో సోమవా రం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు షెడ్యూల్ వెల్లడించారు. ఈ మేరకు దూర విద్య డిగ్రీ, పీజీ పరీక్షలను సెప్టంబర్ 3నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం వెల్లడించారు. పూర్తిస్థాయి టైంటేబుల్ ను కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.