1న జిల్లా స్థాయి చిల్డ్రన్స్‌ సైన్స్‌కాంగ్రెస్‌ | science congress districtleves on 1st | Sakshi
Sakshi News home page

1న జిల్లా స్థాయి చిల్డ్రన్స్‌ సైన్స్‌కాంగ్రెస్‌

Nov 28 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:21 PM

నరసరావుపేట: విద్యార్థుల జిల్లా స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ను నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్‌ బాలుర హైస్కూలు ఆవరణలో డిసెంబర్‌ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 
నరసరావుపేట: విద్యార్థుల జిల్లా స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ను నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్‌ బాలుర హైస్కూలు ఆవరణలో డిసెంబర్‌ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా పేర్లను నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు ఒక విద్యార్థి, ఒక గైడ్‌ ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాలని సూచించారు. విద్యార్థి, గైడ్‌ ఉపాధ్యాయుడు  ఫొటోలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా  కో ఆర్డినేటర్‌ ఏఏ మధుకుమార్‌(సెల్‌ఫోన్‌ నంబర్‌ 90328 71234), జిల్లా అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ షేక్‌.మహమద్‌ గౌస్‌(సెల్‌ఫోన్‌ నంబర్‌ 93900 70555)లను సంప్రదించాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement