ఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు | rm checikngs in hindupur depo | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

Sep 6 2016 11:36 PM | Updated on Sep 4 2017 12:26 PM

చాలాకాలంగా నడుస్తూ 12 లక్షలు కిలోమీటర్లు పూర్తయిన బస్సుల స్థానంలో కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ చిట్టిబాబు అన్నారు.

హిందూపురం అర్బన్‌ : చాలాకాలంగా నడుస్తూ 12 లక్షలు కిలోమీటర్లు పూర్తయిన బస్సుల స్థానంలో కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ చిట్టిబాబు అన్నారు. మంగళవారం ఆయన హిందూపురం డిపోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిపోలో అన్ని విభాగాలను పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. డిపో శుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎం గోపినాథ్‌కు ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బస్టాండుల్లో సౌకర్యాల కల్పనSకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రయాణికుల నుంచి సూచనలు వస్తే స్వీకరించి సరైన సదుపాయలు కల్పిస్తామని చెప్పారు. మూడునెలల క్రితం టెండర్లు ప్రక్రియ పూర్తి చేసుకుని రాష్ట్రానికి వచ్చిన 776 అదె ్దబస్సుల్లో జిల్లాకు 100కు పైగా వచ్చాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాల సర్వీసుల ఆదాయ లెక్కింపులు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అనంతరం సంస్థలోని రిటైర్డు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ æసీటీఎం రాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement