అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల, అధ్యాపకుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో కత్తి నరసింహారెడ్డిని సన్మానించారు.
ఓటర్లలో గందరగోళం సృష్టించాలని చూశారన్నారు. మే«థావులైన టీచర్లు, అధ్యాపకులు ఇలాంటి కుయక్తులను తిప్పి కొట్టారన్నారు. 28 ఏళ్ల పాటు ఉద్యమానికి ఎంతో నీతి నిజాయితీగా పని చేశానని, అంతే నీతి నిజాయితీగా భవిష్యత్తులోనూ పని చేస్తానన్నారు. తనకు మద్ధతిచ్చిన అన్ని సంఘాల నాయకులు, టీచర్లు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుధీర్‌బాబు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఆర్‌యూపీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిచంద్ర, స్కూల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్యారుఖాన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిలాన్, వివిధ సంఘాల జిల్లా నేతలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.