కలసపాడు పోలీసులు గురువారం ఉదయం 14 మంది ఎర్ర చందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు.గురువారం ఉద యం మైదుకూరు డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్ మైదుకూరు నుంచి గిద్దలూరు బయలుదేరింది.
కలసపాడు: కలసపాడు పోలీసులు గురువారం ఉదయం 14 మంది ఎర్ర చందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు.గురువారం ఉద యం మైదుకూరు డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్ మైదుకూరు నుంచి గిద్దలూరు బయలుదేరింది. బస్సు ఉదయం 8 గంటలకు కలసపాడుకు చేరుకోగానే అందులో ఉన్న కానిస్టేబుల్ ప్రయాణికుల్లా ఉన్న కొందరిపై అనుమానం వచ్చి బస్‌ను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లినట్లు ప్రతక్షసాక్షులు తెలిపారు.అక్కడ వారిని తనిఖీ చేయగా తమిళనాడుకు చెందన ఎర్ర చందనం కూలీలు అని నిర్ధారణ కు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ నాగేంద్రను వివరణ కోరగా వారిని విచారిస్తున్నామని తెలిపారు.