జమ్మికుంటలో రేషన్‌ బియ్యం పట్టివేత | ration rise catched | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో రేషన్‌ బియ్యం పట్టివేత

Jul 17 2016 6:30 PM | Updated on Sep 4 2017 5:07 AM

జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి సమయంలో రైళ్లలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌లో రేషన్‌ బియ్యాన్ని తరలించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మొదటి ప్లాట్‌ఫాం 32 సంచుల్లో 20 క్వింటాళ్లు ఉంచారు.

జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి సమయంలో రైళ్లలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌లో రేషన్‌ బియ్యాన్ని తరలించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మొదటి ప్లాట్‌ఫాం 32 సంచుల్లో 20 క్వింటాళ్లు ఉంచారు. ఇదే సమయంలో జమ్మికుంట ఎస్సై సంజయ్‌కుమార్‌ తన సిబ్బందితో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా ప్లాట్‌ఫాంపై 32 సంచులు కనిపించాయి. వెంటనే పోలీసులు సంచులను తెరిచి చూడగా అందులో రేషన్‌ బియ్యం కనిపించాయి. పోలీసులను గమనించి రవాణాదారులు అక్కడి నుంచి జారుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఠాణాకు తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement