పుష్కర ఘాట్‌ పరిశీలన | puskhar ghats visit | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌ పరిశీలన

Aug 1 2016 9:42 PM | Updated on Sep 4 2017 7:22 AM

పుష్కర ఘాట్‌ పరిశీలన

పుష్కర ఘాట్‌ పరిశీలన

దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న పుష్కరఘాట్‌ను జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ సోమవారం పరిశీలించారు.

పెదకళ్లేపల్లి(మోపిదేవి) : దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న పుష్కరఘాట్‌ను జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ కృష్ణానదిపై భారీ వాహనాలను నిషేదించినట్లు చెప్పారు. ఒంగోలు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లే, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మోనిటరింగ్‌ చేస్తామని, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద క్యూలైనులోనే దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు రూట్‌ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులకోసం చేపడుతున్న చర్యలను ఆలయ ఏసీ ఎం శారదాకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ మూర్తి, ఎస్‌ఐలు మణికుమార్, రామకృష్ణ, ఆదిప్రసాద్, ఆర్‌సీ ఏఈ చలపతిరావు, గ్రామ సర్పంచ్‌ అరజా వెంకట సుబ్బారావు, పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement