ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు.
విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు అనే హోంగార్డు పుష్కర విధుల నిమిత్తం ఈ నెల 7వ తేదీన విజయవాడకు వచ్చాడు. 11 వ తేదీ అర్థరాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి హోంగార్డులు ఆయన్ను సమీప ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు.
అనంతరం వెంకటేశ్వరరావును విశాఖ కేజీహెచ్కు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. హోంగార్డు కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.25 వేలు సాయం అందించారు. దీనిపై కనీసం ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ స్పందించడంలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే వెంకటేశ్వరరావు బ్రతికుండేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు.