Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Published Thu, Mar 23 2017 1:22 AM

protect child rights

ఏలూరు రూరల్‌: బాలల హక్కులను పరిరక్షిం చేందుకు ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తానని జిల్లా జడ్జి సునీత అన్నారు. ఏలూరు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ‘బాలల ఆదరణ, రక్షణ’ అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. బాలల న్యాయ చట్ట ప్రయోజనాలను తెలుసుకుని పొరుగువారికి తెలియజేయాలని సూచించారు. జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మెజిస్ట్రేట్‌ డి.ఉమాదేవి మాట్లాడుతూ పేదరికంలో మగ్గిపోతున్న పిల్లలు చోరీ కేసుల్లో ఇరుక్కుంటున్నారన్నారు. వీరికి విద్య, జీవనోపాధి కల్పించాలి్సన అవసరం ఉందన్నారు. ప్రొహిబిషన్‌ జువెనైల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ రీజినల్‌ ఇన్‌స్పెక్టర్‌ నంద గోపాల్‌ మాట్లాడుతూ పిల్లల్లో నేర ప్రవృత్తిని గుర్తించి సన్మార్గంలో నడిపించాలని లేకపోతే నేరస్తులుగా మారతారన్నారు. చైల్డ్‌రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్, జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ, జువెనైల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్, జిల్లా చైల్డ్‌రైట్స్‌ ఫోరం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సంస్థ ప్రతినిధులు పి.ఫ్రాన్సిస్, నేతల రమేష్‌బాబు, యాపిల్‌ కృష్ణ, నికోలా, మాధవి, వసతి గృహం సూపరింటెండెంట్‌ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement