లింక్‌ తెగి.. ముందుకెళ్లిన రైలింజన్‌ | passenger train link cut | Sakshi
Sakshi News home page

లింక్‌ తెగి.. ముందుకెళ్లిన రైలింజన్‌

Sep 18 2016 12:21 AM | Updated on Sep 4 2017 1:53 PM

లింక్‌ తెగిపోవడంతో డోన్‌ నుంచి గుత్తికి వెళ్లే ప్యాసింజర్‌ రైలింజన్‌..బోగీలు లేకుండా వంద మీటర్లు ముందుకు వెళ్లింది.

డోన్‌ టౌన్‌: లింక్‌ తెగిపోవడంతో డోన్‌ నుంచి గుత్తికి వెళ్లే ప్యాసింజర్‌ రైలింజన్‌..బోగీలు లేకుండా వంద మీటర్లు ముందుకు వెళ్లింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కాసేపు ఆందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  విషయం గ్రహించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజిన్‌ను వెనక్కు తెచ్చి బోగీలతో లింక్‌ను సరిచేయడంతో 30 నిమిషాలు ఆలస్యంగా ప్యాసింజర్‌ రైలు గుత్తికి బయలుదేరింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement