‘పాసు పుస్తకాల రద్దు సరికాదు’ | passbooks cancelation issue | Sakshi
Sakshi News home page

‘పాసు పుస్తకాల రద్దు సరికాదు’

Jul 23 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:54 AM

‘పాసు పుస్తకాల రద్దు సరికాదు’

‘పాసు పుస్తకాల రద్దు సరికాదు’

రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు ఆలోచన మానుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తే రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. అడంగళ్‌లో రైతుల పేర్లు తప్పులతడకగా ఉన్నాయని, వాటి సవరణ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

ఎ.కొండూరు:
 రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు ఆలోచన  మానుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తే రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. అడంగళ్‌లో రైతుల పేర్లు తప్పులతడకగా ఉన్నాయని, వాటి సవరణ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. బిల్లులు అందక  పోవడంతో గృహనిర్మాణాలు పూర్తికాక లబ్ధిదారులు పూడి గుడిసెల్లో నివాసముంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ధనికులకు పెన్షన్లు మంజూరు చేస్తూ అర్హులైన పేదల పేర్లు తొలగిస్తున్నారన్నారు. టీడీపీ జెండాలు పట్టుకుంటే సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడం  హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలకుతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించారని గుర్తు చేశారు. మరుగుదొడ్ల బిల్లులు చేయడంలో జాప్యం జరుగుతుందని, అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అర్హులకు తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా నాయకులు నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు, మండల అధ్యక్షుడు భూక్యా గనియా, తూమ్మూరు వెంకటేశ్వరరెడ్డి, అత్తునూరు వెంకటరెడ్డి, చిట్టూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement