సర్పంచులతోనే పంచాయతీల అభివృద్ధి | panchayats develops with sarpanchs | Sakshi
Sakshi News home page

సర్పంచులతోనే పంచాయతీల అభివృద్ధి

Nov 17 2016 12:03 AM | Updated on Sep 4 2017 8:15 PM

పంచాయతీల అభివృద్ధిపై జరుగుతున్న రెండో విడత అవగాహన సదస్సు బుధవారం ముగిసింది.

అనంతపురం సిటీ : పంచాయతీల అభివృద్ధిపై జరుగుతున్న రెండో విడత అవగాహన సదస్సు బుధవారం ముగిసింది. ఇంకా పలు గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని డీసీఆర్‌పీ ప్రిన్సిపల్‌ రామచంద్ర తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సర్పంచులను ఉద్దేశించి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పనులకు పాటు పడాలన్నారు.

శిక్షణా తరగతుల్లో అధికారులు చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకుని మీ గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. సీజనల్‌  వ్యాధులు మీ గ్రామ పంచాయతీల్లోకి రాకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా గ్రామల్లో ఆదర్శ సర్పంచులుగా గుర్తింపు బడతారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌పీ బృందం సభ్యులు, పలు గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement