ఉల్లి ధర మరింత పతనం | onion price down | Sakshi
Sakshi News home page

ఉల్లి ధర మరింత పతనం

Dec 5 2016 12:30 AM | Updated on Jul 29 2019 5:43 PM

తాడేపల్లిగూడెం : కిలో ఉల్లి మార్కెట్‌లో ఎనిమిది రూపాయలకే లభ్యమవుతుతోంది. కర్నూలు నుంచి ఇక్కడి మార్కెట్‌కు వచ్చే ఉల్లిపాయల ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి.

 తాడేపల్లిగూడెం : కిలో ఉల్లి మార్కెట్‌లో ఎనిమిది రూపాయలకే లభ్యమవుతుతోంది. కర్నూలు నుంచి ఇక్కడి మార్కెట్‌కు వచ్చే ఉల్లిపాయల ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. గుత్త మార్కెట్‌లో క్వింటాలు రూ.500 నుంచి రూ.600 వరకు ధర పలికాయి. రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఎనిమిది రూపాయలకే  ఉల్లిపాయలు లభ్యమయ్యాయి. పాత ఉల్లిపాయలు మహారాష్ట్ర నుంచి మార్కెట్‌కు వచ్చాయి. కిలో రూ.12 చేసి గుత్త మార్కెట్‌లో అమ్మగా, విడిగా కిలో రూ.16 చేసి విక్రయించారు. 60 లారీల వరకు మార్కెట్‌కు సరుకు వచ్చినా, కొనేవారు లేక మార్కెట్‌ మందకొడిగా సాగింది. కూరగాయల ధరలు కూడా నెమ్మదించాయి. మార్కెట్‌కు కొత్తగా వచ్చిన పొట్టి చిక్కుడు ధర ఎక్కువుగా పలికింది. తెల్లవంకాయలు కిలో రూ.40 వరకు అమ్మారు. నల్ల వంకాయలు కిలో రూ.20గా ఉన్నాయి. బీర కాయలు కిలో రూ.30 ధర పలికాయి. బెండకాయల ధర మళ్లీ దిగజారింది. గుత్తగా పది కిలోలు రూ.70 పలికాయి. విడిగా కిలో 12 రూపాయలకు అమ్మారు. దొండ కాయలు కిలో రూ.16, దోసకాయలు కిలో రూ.10, చిక్కుడు కాయలు కిలో రూ.24 ధరకు విక్రయించారు. పొట్టి చిక్కుడు కాయలు కిలో 80 రూపాయలకు లభించాయి. క్యాబేజీ కిలో 10 రూపాయలకు పతనమైంది. క్యారట్‌ కిలో రూ.30, బీట్‌రూట్‌ కిలో రూ.30, కీరా కిలో రూ.30 లకు అమ్మారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement