రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Nov 4 2016 11:43 PM | Updated on Sep 4 2017 7:11 PM

మండలం పరిధిలోని పాతరామాపురం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపేట గ్రామానికి చెందిన బొజ్జా బాలకొండయ్య దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి బొజ్జా నరసింహులు తీవ్రగాయాలపాలయ్యారు.

కలసపాడు: మండలం పరిధిలోని పాతరామాపురం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపేట గ్రామానికి చెందిన బొజ్జా బాలకొండయ్య దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి బొజ్జా నరసింహులు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపేట గ్రామానికి చెందిన బొజ్జా బాలకొండయ్య కలసపాడు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు బద్వేల్‌ డిపో హైటెక్‌ బస్సుకు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్నారు. బాల కొండయ్య గ్రామం నుంచి కలసపాడులో బస్సు ఎక్కేందుకు ఆలస్యంగా రావడంతో బస్సు వెళ్లిపోయింది. ఆ బస్సునే ఆందుకునేందుకు  మృత్యుడు బాలకొండయ్య అతని అన్న కుమారుడు బొజ్జా నరసిం హులు ద్విచక్రవాహనం పై వేగంగా గిద్దలూరు రోడ్డుపై వెళ్లారు. కలసపాడు శివారున పాతరామాపురం గ్రామం వద్ద తెలుగు గంగ బ్రిడ్జి దాటిన తరువాత దిగువన ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడింది. బాలకొండయ్యకు తీవ్రగాయాలు కాగా అతనిని వెంటనే చికిత్స నిమిత్తం పోరుమామిళ్లకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిపారు. వాహనం నడుపుతున్న నరసింహులుకు చిన్నచిన్న గాయాలయ్యాయి.  
 

Advertisement

పోల్

Advertisement