రోడ్డుపై కూలిన చెట్టు | On the road to collapse the tree | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కూలిన చెట్టు

Jul 29 2016 11:06 PM | Updated on Sep 4 2017 6:57 AM

రోడ్డుపై కూలిన చెట్టు

రోడ్డుపై కూలిన చెట్టు

మండలంలోని నర్సింగ్‌పూర్‌ శివారులో గురువారం కురిసిన వర్షం, ఈదురు గాలులకు రోడ్డు పక్కన పంట పొలంలో ఉన్న చింత చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై అడ్డంగా కూలింది. దీంతో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు తెగిపోయి రోడ్డుపై పడ్డాయి. చెట్టు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై పడడం, విద్యుత్‌ తీగలు తెగడం వల్ల గ్రామస్తులకు ప్రమాదం తప్పింది.

డిచ్‌పల్లి : మండలంలోని నర్సింగ్‌పూర్‌ శివారులో గురువారం కురిసిన వర్షం, ఈదురు గాలులకు రోడ్డు పక్కన పంట పొలంలో ఉన్న చింత చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై అడ్డంగా కూలింది. దీంతో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు తెగిపోయి రోడ్డుపై పడ్డాయి. చెట్టు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై పడడం, విద్యుత్‌ తీగలు తెగడం వల్ల గ్రామస్తులకు ప్రమాదం తప్పింది. ఉదయాన్నే గమనించిన గ్రామస్తులు వెంటనే ట్రాన్స్‌కో సిబ్బందికి సమాచారం అందించారు. తెగిన వైర్ల వైపు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేసి, రాంపూర్‌ నుంచి నర్సింగ్‌పూర్‌ గ్రామానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. రోడ్డుపై అడ్డంగా చెట్టు పడటం వల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాన్స్‌కో సిబ్బంది చెట్టును తొలగించి విరిగిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. 

Advertisement

పోల్

Advertisement