యోగివేమన విశ్వవిద్యాలయం మనోవిజ్ఞానశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వíß ంచనున్నట్లు సదస్సు కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.లలిత, కో–ఆర్డినేటర్ వి. లాజరస్ ఒక ప్రకటనలో తెలిపారు.
వైవీయూ:యోగివేమన విశ్వవిద్యాలయం మనోవిజ్ఞానశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వíß ంచనున్నట్లు సదస్సు కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.లలిత, కో–ఆర్డినేటర్ వి. లాజరస్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైకాలజిస్ట్స్ ఆన్ సైకాలజీ ఫార్ హెల్త్ హార్మనీ అండ్ హ్యాపీనెస్’ అన్న అంశంపై సదస్సు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు కర్నాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న 75 మంది పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎస్వీయూ, బెంగుళూరు, పెరియార్, గుల్బర్గా విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు విచ్చేసి సదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు.