రహదారుల నిర్మాణంలో కొత్త పోకడలు | New trends in the construction of roads | Sakshi
Sakshi News home page

రహదారుల నిర్మాణంలో కొత్త పోకడలు

Sep 27 2016 1:18 AM | Updated on Sep 4 2017 3:05 PM

రహదారుల నిర్మాణంలో కొత్త పోకడలు

రహదారుల నిర్మాణంలో కొత్త పోకడలు

కాజీపేట నిట్‌లోని న్యూ సెమినార్‌ హాల్‌లో సోమవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ప్రాముఖ్యత’ అనే అంశంపై వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. నిట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఇంజినీర్, అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ నిపుణుడు గోర్డాన్‌ ఆర్‌.కెల్లర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

  •  గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై   దృష్టి సారించాలి 
  • అంతర్జాతీయ ఇంజినీరింగ్‌  నిపుణుడు గోర్డాన్‌
  • నిట్‌లో వర్క్‌షాప్‌ ప్రారంభం
  •  
    కాజీపేట రూరల్‌: కాజీపేట నిట్‌లోని న్యూ సెమినార్‌ హాల్‌లో సోమవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ప్రాముఖ్యత’ అనే అంశంపై వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. నిట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిటైర్డ్‌  ఫారెస్ట్‌ ఇంజినీర్, అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ నిపుణుడు గోర్డాన్‌ ఆర్‌.కెల్లర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
    ఈసందర్భంగా గోర్డాన్‌మాట్లాడుతూ విదేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అతితక్కువ వ్యయంతో రహదారులు నిర్మించడానికి అనుసరిస్తున్న పద్ధతులను వివరించారు. రోడ్ల నిర్మాణంలో కెమికల్స్, మట్టి, వెదురు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట్లలో వెదురు బొంగులు, సర్వే కర్రలు, కెమికల్స్‌తో కలిపిన మిశ్రమంతో వంతెనలను నిర్మిస్తారని తెలిపారు. భారత్‌లోనూ ఆయా పద్ధతులను రోడ్ల నిర్మాణానికి వాడొచ్చన్నారు. 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా భారతదేశంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. జాతీయ రహదారుల ఆధునికీకరణ, షరతులు, నిర్వహణ, మెటీరియల్‌ వంటి అంశాల గురించి గోర్డాన్‌ వివరించారు. అనంతరం గెయిన్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ సిఎస్‌ఆర్‌కె.ప్రసాద్, వర్క్‌షాప్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.శంకర్, డాక్టర్‌ వెంకయ్య చౌదరి మాట్లాడారు. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఆఫ్‌ అకాడమిక్‌ నెట్‌వర్క్స్‌(జీఐఏఎన్‌) కోర్సులో భాగంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌ ఈనెల 30 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు. వివిద రాష్ట్రాల విద్యార్థులు, అధ్యాపకులు, పీహెచ్‌డీ స్కాలర్స్‌ హాజరయ్యారు.  

Advertisement
Advertisement