
భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్
వర్షాకాలంలో మూగజీవాల ఆరోగ్య విషయంలో పశు వైద్యులు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వేపకుంట్లలో రూ.7.5 లక్షలతో నిర్మాణం చేసిన గోపాల మిత్ర పశువైద్య శిబిరం భవనాన్ని ప్రారంభించారు.
- ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
హరితహారంలో భాగంగా ప్రతి ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలన్నారు. ఇంకా సభలో ఎంపీపీ మాలోత్ శాంత, జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, ఏడీలు శ్రీనివాసరావు, జైన్, పశువైద్యాధికారి డాక్టర్ కిషోర్, ఎంపీటీసీ రెంటాల ధానయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ రామారావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరమణ, హనుమంతురావు, కోదండరాములు, వెంకటేశ్వర్లు, పశువైద్య సిబ్బంది ఆరోగ్య మిత్ర తదితరులు పాల్గొన్నారు. పశువైద్యశాల నిర్మాణానికి స్థలాన్ని దానంగా ఇచ్చిన దాత మంకెన నాగేశ్వరరావును ఎమ్మెల్యే, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధిలు ప్రత్యేకంగా అభినందించారు.