సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ | Mudragada Padmanabham letter to chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ

Feb 16 2016 1:21 PM | Updated on Jul 30 2018 6:21 PM

రాష్ట్రంలో జస్టిస్ మంజునాథ్ కమిషన్ పర్యటన వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.

కాకినాడ : రాష్ట్రంలో జస్టిస్ మంజునాథ్ కమిషన్ పర్యటన వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపుల రుణ దరఖాస్తులకు కాలపరిమితి లేకుండా చూడాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

కాపుల రుణ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని సూచించారు. జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేయాలని చంద్రబాబును ముద్రగడ కోరారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement